బిఎల్ఎస్ పాస్‌పోర్టు కేంద్రాన్ని సందర్శించిన రాయబారి..సమస్యలను అడిగి తెలుసుకున్న వైనం

- March 31, 2022 , by Maagulf
బిఎల్ఎస్ పాస్‌పోర్టు కేంద్రాన్ని సందర్శించిన  రాయబారి..సమస్యలను అడిగి తెలుసుకున్న వైనం

కువైట్: కువైట్‌లో భారత రాయబారి అయిన శ్రీ శిబి జార్జి, భారత పాస్‌పోర్టు ఔట్ సోర్సింగ్ కేంద్రాన్ని (కువైట్ సిటీలోని) సందర్శించి, అక్కడ కమ్యూనిటీ గ్రీవెన్స్‌లను తెలుసుకున్నారు. ఎంబసీ ఓపెన్ హౌస్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కేంద్రంలో అందుతున్న సేవల్ని రాయబారి పరిశీలించారు. అలాగే సందర్శకులతో సమావేశమయ్యారు. కాగా, శిబి జార్జి ఏప్రిల్ 6న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు అబ్బాసియా కేంద్రాన్ని సందర్శిస్తారు. ఫహాహీల్ కేంద్రాన్ని బుధవారం ఏప్రిల్ 13న సందర్శిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com