బంపర్ ఆఫర్ అందిస్తున్న ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌

- April 01, 2022 , by Maagulf
బంపర్ ఆఫర్ అందిస్తున్న ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌
హైదరాబాద్‌: ఈ ఉగాదితో ప్రారంభించి ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌ (ఎల్‌ అండ్‌ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌) హైదరాబాద్‌ నగరవాసుల నడుమ సెలవుల సంతోషాన్ని తమ వినూత్నమైన సూపర్‌ సేవర్‌ మెట్రో హాలీడే కార్డ్‌ ద్వారా  విస్తరిస్తోంది.ఈ కార్డుతో హైదరాబాద్‌లో 57 మెట్రో స్టేషన్‌ల నడుమ  ఒకరోజులో అపరిమిత మైన సార్లు తిరగవచ్చు. సంవత్సరంలో  వర్తించేటటువంటి 100 సెలవు దినాలలో మాత్రమే ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. ఈ సూపర్‌ సేవర్‌ మెట్రో హాలీడే కార్డును నేడు ఎల్‌ అండ్‌ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌  ఎండీ – సీఈవో  కెవీబీ రెడ్డి  అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ ప్రాంగణంలో ప్రయాణీకులు, మెట్రో అధికారుల సమక్షంలో విడుదల చేశారు.  ఈ సూపర్‌ సేవర్‌ మెట్రో హాలీడే కార్డు ఏప్రిల్‌ 02 నుంచి అందుబాటులో ఉంటుంది.
 
మెట్రోరైల్‌ ప్రయాణీకులు ఎవరైనా సరే ఒక్కసారి తిరిగి చెల్లించబడనటువంటి 50 రూపాయలతో పాటుగా 59 రూపాయలను టాపప్‌ విలువ చెల్లించడం ద్వారా  ఈ కార్డు పొందవచ్చు. ఈ టాపప్‌ విలువ కేవలం వర్తించేటటువంటి సెలవు దినాలకు మాత్రమే పరిమితం. ఆ రోజు మాత్రమే దానిని వాడుకోవాల్సి ఉంటుంది.
ఎన్‌వీఎస్‌ రెడ్డి, ఎండీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మాట్లాడుతూ ‘‘సూపర్‌ సేవర్‌ మెట్రో హాలీడే కార్డును మాప్రయాణికులకు అందించడాన్ని మించిన ఆఫర్‌ ఏముంటుంది . ఈ తరహా ఆఫర్‌లు నగర ప్రయాణాలకు మరింత అధికంగా మెట్రో వినియోగించుకునేందుకు స్ఫూర్తి కలిగిస్తాయి’’ అని అన్నారు.
 
కెవీబీ రెడ్డి, ఎండీ అండ్‌ సీఈవో, ఎల్‌ అండ్‌ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ మాట్లాడుతూ ‘‘అత్యంత శుభప్రదమైన ఉగాది రోజు నుంచి మా ప్రయాణీకులకు పూర్తి అందుబాటులో ఉండే సూపర్‌  సేవర్‌ మెట్రో  హాలీడే కార్డు విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. నామమాత్రపు రీచార్జ్‌తో జాబితాకరించిన సెలవు రోజుల్లో 59 రూపాయలకే ప్రయాణం చేయవచ్చు. మా ప్రయాణీకులకు అత్యుత్తమ శ్రేణి ప్రయాణ అవకాశాలను అందించడానికి కట్టుబడి ఉన్నామనే మా నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది’’ అని అన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com