రేపట్నుంచే రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు శుభవార్త
- April 01, 2022
హైదరాబాద్: పవిత్ర రమదాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 3 నుంచి మే 2వ తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే తమ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెలవంక దర్శనం మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఇస్లాంలో రమదాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపైకి అవతరించింది. దీనికి ప్రతీకగా ఈ మాసంలో ఉపవాసాలను ఆచరిస్తారు. రమదాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!