ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- April 01, 2022
అమరావతి: శుభకృత్ నామ సంవత్సరాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాలను నాంది వాచకంగా నిలవాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆకాంక్షించారు.ఉగాది సందేశాన్ని అందించిన గవర్నర్, తెలుగు సంవత్సరానికి ఆదిగా భావించే సంతోషకరమైన, పవిత్రమైన “ఉగాది” సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అందించారు. "ఉగాది" ఆనందం, ఆశల కలయికగా అందరికీ కొత్త ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నారు. ‘శుభకృతు నామ ఉగాది’ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగించాలని గవర్నర్ పేర్కొన్నారు.ఉగాది పచ్చడి ఏడాది పొడవునా జీవితంలో అందించే అన్ని రకాల రుచులను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుందని గవర్నర్ వివరించారు.నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ వృద్ది నమోదు చేయాలని, రైతులతో పాటు సకల వృత్తుల ప్రజలు ఆనందంగా ఉండాలని గవర్నర్ అన్నారు.ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించడం ద్వారా ప్రజలు తమను తాము రక్షించుకోవాలని,కరోనా ప్రవర్తన నియమావళి కట్టుబడి దాని వ్యాప్తిని నిరోధించాలని హరి చందన్ ప్రజలకు విజ్ఞప్తి చే
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?