రమదాన్.. మారిన BLS పాస్‌పోర్ట్ సెంటర్ వర్కింగ్ అవర్స్

- April 03, 2022 , by Maagulf
రమదాన్.. మారిన BLS పాస్‌పోర్ట్ సెంటర్ వర్కింగ్ అవర్స్

కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో భారతీయ పాస్‌పోర్ట్, వీసా మరియు కాన్సులర్ అవుట్‌సోర్సింగ్ సెంటర్ BLS ఇంటర్నేషనల్ కొత్త వర్కింగ్ అవర్స్ ని ప్రకటించింది. రమదాన్ సందర్భంగా కువైట్ సిటీ, అబ్బాసియా, ఫహాహీల్‌లోని BLS కేంద్రాలు ఉదయం షిఫ్ట్ లో మాత్రమే పని చేస్తాయని పేర్కొంది. శుక్రవారం, శనివారంతో సహా అన్ని రోజులలో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు మాత్రమే పనిచేస్తాయని వెల్లడించింది.  అయితే, భారత రాయబార కార్యాలయం అత్యవసర కాన్సులర్ సేవలను కొనసాగిస్తుందని ఎంబసీ తెలియజేసింది. ఏదైనా అత్యవసర సంప్రదింపుల కోసం [email protected]ని సంప్రదించవచ్చని లేదా ఎంబసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎంబసీ యొక్క 24X7 WhatsApp హెల్ప్ లైన్ నంబర్‌లను సంప్రదించాలని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com