రమదాన్.. 114 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- April 03, 2022 , by Maagulf
రమదాన్.. 114 మంది ఖైదీలకు క్షమాభిక్ష

ఫుజైరా:  వివిధ దేశాలకు చెందిన 114 మంది ఖైదీలకు రమదాన్ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు ఫుజైరా పాలకుడు H.H. షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీ క్షమాభిక్ష ప్రసాదించాడు. ఆయన ఆదేశాల మేరకు త్వరలోనే వారిని విడుదల చేయనున్నారు. సత్ప్రవర్తనను నిరూపించుకున్న ఖైదీలకు మాత్రమే క్షమాభిక్ష ప్రసాదించారు. వారు తమ కుటుంబాలతో పవిత్రమైన రమదాన్ మరియు ఈద్ ఎల్ ఫితర్ మాసాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉదారమైన నిర్ణయం తీసుకున్న షేక్ హమద్‌కు ఫుజైరా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ బిన్ ఘనేమ్ అల్ కాబి కృతజ్ఞతలు తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com