హైదరాబాద్: బంజారాహిల్స్ సీఐ శివచంద్ర సస్పెండ్
- April 03, 2022
హైదరాబాద్: బంజారాహిల్స్ సీఐ శివచంద్ర పై సస్పెన్షన్ వేటు పడింది. డ్రగ్స్ కేసులో సీఐ శివచంద్ర స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.పేర్లు మాత్రమే రాసుకుని పంపించామని తెలిపారు.నాగబాబు కుమార్తె కనిపించలేదన్నారు. మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలంటూ సీఐ హడావుడి చేశారు. ఎలాంటి క్లారిటీ లేదన్నారు.వివరాలు వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌పై అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడులు చేశారు.సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఫుడింగ్ మింగ్ పబ్‌పై రైడ్ చేశారు. అక్కడికి పోలీసులు వెళ్లేసరికి దాదాపు 150 మంది యువతీ యువకులు.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలోనూ మత్తులో జోగుతూ.. తూలుతున్న కాళ్లతోనే డ్యాన్స్‌లు చేస్తున్నారు.
వెంటనే పబ్ నిర్వాహకులతో పాటు 150 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో 40 మంది వరకు యువతులు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నాడు. ఫారినర్స్ కూడా ఉన్నారు. వీరి వివరాలు సేకరించి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. పిలిచినప్పుడు రావాలంటూ వారిని ఇంటికి పంపించారు. అయితే వీరంతా.. తమను ఎందుకు తీసుకొచ్చారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.
అందరూ బడా వ్యాపారులు, రాజకీయ నేతలకు సంబంధించిన పిల్లలు కూడా ఉండటంతో పోలీసులు కూడా ఎక్కువగా స్పందించలేకపోతున్నట్టు సమాచారం. ఇక పబ్‌లో రేవ్ పార్టీ జరిగిందంటూ ప్రచారం జరిగింది. దీంతో ఉన్నతాధికారులు కూడా దీనిపై ఆరా తీశారు. అయితే పబ్‌లో రేవ్ పార్టీలు ఏమీ జరగలేదని.. జస్ట్ టైమ్ దాటిన తర్వాత కూడా నిర్వహిస్తుండటంతోనే రైడ్ చేసినట్టు పోలీసులు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







