అయోధ్య రామ మందిర గర్భగుడి నమూనా చిత్రం విడుదల
- April 03, 2022
న్యూ ఢిల్లీ: భారతీయుల చిరకాల స్వప్నం అయోధ్యలో శ్రీరాముడి ఆలయం మరికొన్ని రోజుల్లోనే సాక్షాత్కారం కానుంది. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు దాదాపు 4 నెలల ముందు అంటే 2023 డిసెంబర్ నాటికి ఆలయం సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివరాలు మేరకు.. రామ మందిర ఆలయ పునాది సిద్ధంగా ఉందని..తెప్ప పై సంస్థాపన పని మరో రెండు నెలల్లో చేపట్టనున్నారు. ఆలయానికి రాళ్లు, స్తంభాలు చేర్చే పనులు జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించినట్లుగా ఆలయం సిద్ధమయ్యాక, రాంలల్లా(రాముడి విగ్రహం) ప్రస్తుత తాత్కాలిక ఆలయం నుండి కొత్తగా నిర్మించిన ఆలయ గర్భగుడిలో సమస్త హిందూ ఆచార వ్యవహారాలతో ప్రతిష్టించనున్నారు. డిసెంబర్ 2023లో నిర్వహించనున్న ఈకార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కాగా, అయోధ్య రామ మందిరం గర్భగుడి యొక్క నమూనా చిత్రాన్ని ఆదివారం మీడియాకు విడుదల చేశారు. ఆలయ నిర్మాణంలో ఆర్కిటెక్ట్ గా వ్యవహరిస్తున్న సిబి సోంపురా మరియు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న ఏజెన్సీలు ఈ డిజైన్ ను రూపొందించాయి. వారు వెల్లడించిన వివరాల ప్రకారం గర్భగుడిలోకి చేరుకోవాలంటే ఆలయ ప్రధాన ద్వారం నుంచి 21 అడుగుల మేర ఎత్తు ఉండే మెట్లు ఎక్కాలి. గర్భ గుడి ముందు భాగంలోని భారీ మంటపంలోని స్తంభాలలో శ్రీరాముడు బాల్య రూపంలో ఆయన సోదరులు లక్ష్మణ్, భరత, శతృఘ్నలతో కలసి దర్శనమిస్తారు.
ఆలయాన్ని పలు పొరలుగా విభజించిన ఆర్కిటెక్ట్ లు.. ప్రస్తుతం 21 అడుగుల ఎత్తున్న మొదటి పొరపనులు 50 శాతం మేర పూర్తి చేశారు. మొత్తం ఏడు పొరల ప్లింత్ పనులను ఈ ఏడాది జూన్ నాటికే పూర్తి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ప్రతి రోజు సుమారు 80 నుండి 100 రాళ్లు పైకి చేర్చనున్నారు. ఒక అంచనా ప్రకారం ఆలయం పూర్తయి భక్తుల దర్శనానికి అనుమతి వస్తే ఒక రోజులో లక్ష మంది రామ భక్తులు ఆలయాన్నీ సందర్శిస్తారని ట్రస్ట్ నిర్వాహకులు భావిస్తున్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ నమూనాను మార్చారు. ఇది నగారా శైలిలో నిర్మించిన అష్టభుజి ఆలయం.ఇందులో శ్రీరాముడు మరియు రామ్ దర్బార్ విగ్రహం ఉంటుంది.ప్రధాన ఆలయం ముందు మరియు వెనుక సీత, లక్ష్మణ, భరతుడు మరియు గణేశ దేవాలయాలు ఉండనున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







