అజ్మన్ లో అంగరంగ వైభవంగా జరిగిన' శ్రీనివాస కళ్యాణం'
- April 03, 2022
యూఏఈ:ప్రతి ఏటా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభావంగా నిర్వహిస్తారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ మహాఘట్టానికి భక్తులు 2 సంవత్సరాలు దూరంకావలసి వచ్చింది. ఇక కరోనా కాస్త నెమ్మదించడటంతో యూఏఈ అధికారులు సైతం ఈ కళ్యాణమహోత్సవానికి అన్ని అనుమతులు మంజూరు చేయటంతో ఎప్పుడు ఇప్పుడా అని ఎదురుచూసిన ఆ ఏడుకొండలవాని కళ్యాణం యూఏఈ లోని అజ్మన్ లో ఉగాది పర్వదినాన అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలను ఆ తిరుమలలో జరిగే విధంగా నిర్వహించడం గమనార్హం.సుప్రభాత సేవతో మొదలైన ఈ కళ్యాణమహోత్సవ వేడుక పంచాంగ శ్రవణం, హోమం, కళ్యాణం, ప్రసాద సేవనంతో ముగిసింది.
జ్యోతిర్విద్యాభూషణ బ్రహ్మశ్రీ డా.కాకునూరి సూర్యనారాయణ మూర్తి చే పంచాంగ శ్రవణం కావించబడింది.విచ్చేసిన భక్తులు తమ తమ రాశిఫలాలను తెలుసుకొని ఉగాది పచ్చడి సేవించటం జరిగింది.వారణాసి నుంచి సప్త ఋషులలో ఒకరైన కశ్యాప్ మహామణి వారసుడు అయిన అభిషేక్ చౌబే కూడా విచ్చేసారు.
అనంతరం పలు కీర్తనలు,భజనలు భక్తులు ఆలపించి శ్రీవారికి సంగీతసేవ చేశారు.అసంఖ్యాకంగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వేంకేటేశ్వరుని కృపకు పాత్రులయ్యారు.అన్ని కోవిడ్ భద్రతా నియమాల మధ్య ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు నిర్వాహకులు.ఈ కార్యక్రమానికి 13,000 మంది పైగా భక్తులు విచ్చేశారని కార్యక్రమ నిర్వాహకులు కఠారు సుదర్శన తెలిపారు.





తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







