వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం

- April 03, 2016 , by Maagulf
వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 2007 'శంకర్‌ దాదా జిందాబాద్‌' తరువాత ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రామ్‌చరణ్‌ కథానాయకుడుగా ఇటీవల విడుదలైన 'బ్రూస్‌లీ' చిత్రంలో అతిథిగా కనిపించి అభిమానులు అలరించారు ఈ గ్యాంగ్‌లీడర్‌. తాజాగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం తెరకెక్కనుందని నటుడు నందా(ఆనంద శ్రీకృష్ణ) సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారని పోస్ట్‌ చేశారు.ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' టైటిల్‌ను అనుకున్నట్లు రామ్‌చరణ్‌ అభిమానులు ఫేస్‌బుక్‌లో హల్‌చల్‌ చేస్తున్నారు.మరో నెలలో వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో చరణ్‌ సారథ్యంలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com