దుబాయ్ లో తెలుగు అసోసియేషన్ వారి ఉగాది వేడుకలు
- April 04, 2022
దుబాయ్: దుబాయ్ లో ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.తెలుగు అస్సోసియేటిన్ వారి ఆధ్వర్యంలో షేక్ రషీద్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలలో పలువురు సినీతారలు పాల్గొని మరింత కళను చేకూర్చారు.
మామిడి తోరణాలతో, బంతి పూలతో మరియు రంగు రంగుల ముగ్గులతో అతి సుందరంగా అలంకరించిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వేడుకలలో యూఏఈ లోని వివిధ ఎమిరేట్స్ అనగా..దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, అబుధాబి నుంచి వచ్చిన ప్రతిభావంతులైన చిన్నారులు మరియు యువ బృందాలు చేసిన సంపద్రాయ, సినీ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. యూఏఈ నుంచే కాక, భారత్ నుండి విచ్చేసిన ప్రముఖ గాయకులు సౌమ్య, సాయిచరణ్ కూడా పాల్గొని వారి గాత్రమాధుర్యములో ఆహూతులని ఓలలాడించారు.
తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన ఈ వేడుకలలో నటుడు శ్రీకాంత్ మరియు నటి ఈషా రెబ్బా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిని అసోసియేషన్ సభ్యులు మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సత్కరించారు.
కార్యక్రమ వ్యాఖ్యాతగా మైథిలి వ్యవహరించారు. ఈ వేడుకలకు..త్రిపుర కంస్ట్రకషన్స్, శుభోదయం గ్రూప్, మలబార్ గోల్డ్, ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, డాలర్ డివైన్ క్లబ్, హాక్ సెక్యూరిటీ సర్వీసెస్, అల్ కెండి గ్రూప్, మైదుబాయి, అల్ మరై, 64 టేస్ట్స్ ఆంధ్రా రెస్టారెంట్ తదితరులు స్పాన్సర్లుగా వ్యవహరించారు. అసోసియేషన్ వ్యవస్థాపక మరియు డైరెక్టర్ల బోర్డు వారి పణ్రాళిక, కల్చరల్ డైరక్టర్ మరియు వారి బృంద సభ్యులు, అసోసియేషన్ లోని మిగిలిన అన్ని విభాగాల బృంద సభ్యులందరి సహకారంతో ఈ ఉగాది వేడుకలు విజయవంతం అయ్యాయి అని అసోసియేషన్ కమిటీ తెలిపింది.
_1649053370.jpg)
_1649053339.jpg)
_1649053448.jpg)
_1649053323.jpg)
_1649053361.jpg)
_1649053311.jpg)

తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









