రమదాన్ 2022: 178 మంది బిచ్చగాళ్ళను అరెస్టు చేసిన దుబాయ్ పోలీస్
- April 04, 2022
యూఏఈ: దుబాయ్ పోలీస్ 178 మంది బిచ్చగాళ్ళను మార్చి 18 నుంచి రమదాన్ ప్రారంభం వరకు అరెస్టు చేయడం జరిగింది. వీరిలో 134 మంది పురుషులు, 44 మంది మహిళలు వున్నారు.యాంటీ ఇన్‌ఫిల్ట్రేటర్స్ - జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ అదిది ఈ విషయాన్ని వెల్లడించారు.పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించి బిచ్చగాళ్ళను అరెస్టు చేసినట్లు చెప్పారు.ఈ తరహా చర్యలతో ఏ ఏడాదికి ఆ ఏడాది బిచ్చగాళ్ళ సంఖ్యను తగ్గించగలుగుతున్నట్లు పేర్కొన్నారు. అధికారిక ఛారిటీ వేదికల ద్వారా మాత్రమే అవసరమైనవారికి సాయం చేయాలనీ, బిచ్చగాళ్ళను ప్రోత్సహించరాదని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







