మోసం కేసులో బహ్రెయినీ తండ్రి, కొడుక్కి ఊరట
- April 04, 2022
మనామా: హై అప్పీల్స్ కోర్టు ఓ బహ్రెయినీ వ్యక్తికీ, ఆయన తనయుడికీ మోసం కేసు నుంచి ఊరట కల్పించింది.కింది కోర్టు ఈ ఇద్దరికీ ఊరటనివ్వగా, దాన్ని అవతలి వ్యక్తి అప్పీల్ చేశారు. బాధితుడుగా చెప్పబడుతున్న వ్యక్తి 100,000 బహ్రెయినీ దినార్లు తన కంపెనీల ద్వారా బహ్రెయినీ వ్యక్తికి ఇచ్చినట్లు కేసులో పేర్కొన్నారు. 10 శాతం లాభంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందం గడువు పూర్తయ్యాక చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని బాదితుడుగా చెప్పబడుతున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదయ్యింది. కాగా, ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున న్యాయస్థానం కేసుని కొట్టివేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







