రమదాన్ 2022: ఉచిత ఎన్వోఎల్ కార్డులు, వెయ్యికి పైగా ఇఫ్తార్ మీల్స్
- April 04, 2022
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో రేషన్ కోసం ఉచిత ప్రీ పెయిడ్ ఎన్వోఎల్ కార్డులు, వెయ్యికి పైగా ఇప్తార్ మీల్స్ అలాగే బ్రెడ్స్ వంటివాటిని అవసరంలో వున్నవారికి అందించేందుకు పలు కమ్యూనిటీ ఇనీషియేటివ్స్ దుబాయ్ రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. బస్ డ్రైవర్లు, వర్కర్లు, డెలివరీ బైక్ మరియు ట్రక్ డ్రైవర్లు, అనాధలకు, తక్కువ ఆదాయం గల కుటుంబాలకు సాయం అందించనున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో రోజుకి 1000 మీల్స్ చొప్పున మొత్తంగా నెలలో 30,000 మీల్స్ ‘మీల్స్ ఆన్ వీల్స్’ విభాగంలో పంపిణీ చేయనున్నట్లు మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ రౌదాహ్ అల్ మెహ్రిజి చెప్పారు. జాయెద్ హ్యూమానిటేరియన్ డే నేపథ్యంలో ప్రీపెయిడ్ ఎన్వోఎల్ కార్డుల్ని పేదలకు అందిస్తున్నారు. మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ గ్లోబల్ ఇనీషియేటివ్స్ పేరుతో సాబిల్ బ్రెడ్ ప్రాజెక్టు ద్వారా ఆయా కుటుంబాలకు సాయం చేస్తారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







