UAE: పాస్పోర్ట్ లలో రెసిడెన్సీ వీసా స్టాంప్ బంద్
- April 05, 2022యూఏఈ: UAEలోని ప్రవాసులు ఇకపై వారి పాస్పోర్ట్ లపై రెసిడెన్సీ వీసాలను ముద్రించాల్సిన అవసరం లేదు.ఏప్రిల్ 11 తర్వాత జారీ చేయబడిన నివాస పత్రాలకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు గుర్తింపు, పౌరసత్వం, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ కోసం ఫెడరల్ అథారిటీ ఒక సర్క్యులర్ జారీ చేసింది.దీని ప్రకారం నివాసితుల ఎమిరేట్స్ ID వారి నివాస పర్మిట్ గా పరిగణించబడుతుంది. ఈ IDలో నివాస సంబంధిత సమాచారం ఉంటుంది.నివాసితుల ఎమిరేట్స్ ID, పాస్పోర్ట్ నంబర్ ద్వారా ఎయిర్లైన్స్ రెసిడెన్సీ స్టేటస్ ని ధృవీకరిస్తాయి. ప్రజలకు అందించే సేవలను అప్గ్రేడ్ చేయడం లక్ష్యంగా ఈ సంవత్సరం ప్రారంభంలో చేసిన క్యాబినెట్ తీర్మానం ఆధారంగా రూపొందించబడింది. రెసిడెన్సీ వీసా అనేది ప్రవాసులు వైద్య పరీక్ష చేయించుకున్న తర్వాత వారి పాస్పోర్ట్ లపై స్టాంప్ చేసే స్టిక్కర్. నివాసి కలిగి ఉన్న వీసా ఆధారంగా ఇది రెండు, మూడు, ఐదు లేదా 10 సంవత్సరాల కాలానికి జారీ చేస్తారు.
--సుమన్ కోలగట్ల (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు