తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా 'ఉగాది' వేడుకలు

- April 05, 2022 , by Maagulf
తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా \'ఉగాది\' వేడుకలు

దోహా: తెలుగు కళా సమితి రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘శుభోదయం- ఉగాది వేడుకలు’ ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 1న వుకైర్ లోని లయోలా ఇంటర్నేషనల్ స్కూల్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.భారత రాయబారి  డాక్టర్ దీపక్ మిట్టల్, తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ తాతాజీ వుసిరికల లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శివ ప్రసాద్ కోడూరు, విశ్వనాధం రజనీ మూర్తిలకు రజతోత్సవ పురస్కారాలను అందజేశారు.ప్రత్యేక అతిధులుగా శుభోదయం గ్రూప్ అధినేత డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, తెలుగు సినీ గాయని ఉష పాల్గొన్నారు. అంతకుముందు ప్రముఖ సినీ గాయని గాయకులు పార్థసారథి, హరిణిలు తమ గాన మాధుర్యంతో అలరించారు.రెండు గంటల పైగా నిర్వహించిన సంగీత విభావరి సభికులును విశేషంగా ఆకట్టుకున్నది.ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగశ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్యాలు, వీణ వాయిద్యం,  తెలుగు సినీ గాయని గాయకులచే సంగీత విభావరి కార్యక్రమాలు ఆహుతులందరీనీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా వందకు పైగా తెలుగు కార్మికులను  ప్రవేశ రుసుము లేకుండా కార్యక్రమానికి ఆహ్వానించారు. Alkhor కమ్యూనిటీకి చెందిన రవి కలపాటి, రవి ఏచూరి, ఆదిత్య,  కుల శేఖర్, ఈశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, గిరి, స్వర్ణ తదితరులు పెద్ద సంఖ్యలో స్పాన్సర్స్ గా వచ్చి కార్యక్రమ నిర్వాహణలో పాలుపంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు.. వైస్ ప్రెసిడెంట్ కాళిబాబు గంటి, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ అనుమల్ల, కల్చరల్ సెక్రెటరీ సుజిత సాయిని.. ఇతర కార్యవర్గం సభ్యులు భవానీ బొమ్మిరెడ్డి , శ్రీనివాస బాబు తమ్మిన, మనీష్ ఆరోన్ , అయ్యన్న చల్లా, రవి కిరణ్ కోట్ని, దీపక్ చుక్కల, బాబా ప్రసాద్ పాల్గొన్నారు.మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించగా.. La Castle- హాస్పిటాలిటీ పార్టనర్, లయోలా స్కూల్-వెన్యూ పార్టనర్ గా ఉన్నారు. MBR టెక్నాలజీస్,  DAYA Hospitals విశాఖపట్నం, గ్రేట్ కేర్, ల్యాంకో ఖతార్, రాయల్ Regis, ETC ట్రేడింగ్, అమరాన్ బ్యాటరీస్, Boom  constructions స్పాన్సర్స్ గా వ్యవహరించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com