సౌదీ అరేబియా అబ్షెర్ ద్వారా ఇరాక్‌కు ప్రయాణ అనుమతి

- April 05, 2022 , by Maagulf
సౌదీ అరేబియా అబ్షెర్ ద్వారా ఇరాక్‌కు ప్రయాణ అనుమతి

రియాద్: అబ్షెర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఇరాక్‌కు ప్రయాణ అనుమతిని జారీ చేయనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది. ఇరాక్‌కు ప్రయాణ అనుమతులు జారీ చేసే సర్వీసును అబ్షెర్ ప్లాట్‌ఫారమ్‌లోని తవాసుల్ జాబితాలో చేర్చినట్లు చెప్పింది. ఇది జవాజాత్ ప్రధాన కార్యాలయం లేదా బ్రాంచ్ కార్యాలయాలను వ్యక్తిగతంగా సంప్రదించాల్సిన అవసరం లేకుండానే ప్రయాణ అనుమతిని పొందేందుకు లబ్ధిదారులకు అవకాశం కల్పించారు. నిబంధనలు, షరతులకు అనుగుణంగా ప్రయాణ అనుమతి జారీ చేయబడుతుందని జవాజత్ తెలిపింది. నా సేవల జాబితా (ఖిద్మతి) లోకి వెళ్లి.. జవాజత్ సెక్టార్‌, తవాసుల్ సర్వీస్ ను ఎంచుకోవాలి. కొత్త అప్లికేషన్‌ను సమర్పించడం, దరఖాస్తు రకాన్ని పేర్కొనడం ద్వారా అబ్షర్ ప్లాట్‌ఫారమ్‌లోని లబ్ధిదారుల అకౌంట్ ద్వారా సర్వీసును యాక్సెస్ చేయవచ్చు. దీని తర్వాత దరఖాస్తుదారు సబ్-సర్వీస్ “రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్‌కి ప్రయాణ అనుమతిని” ఎంచుకోవాలి. ఆపై అనుమతిని పొందడం కోసం దరఖాస్తుదారునికి సమీపంలోని ప్రాంతీయ కార్యాలయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దరఖాస్తుదారు తమ వివరాలను రాసి దానికి జాతీయ ID కాపీ, కుటుంబ కార్డ్ ను జతచేసి అధికారులకు అందివ్వాలి.దరఖాస్తుదారు సమర్పించిన అన్ని పత్రాలను పరిశీలించింది అనుమతి పత్రాన్ని జవాజత్ వెబ్‌సైట్‌లో అందుబాటులో పెడతామని జవాజత్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com