ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన రాచకొండ పోలీస్
- April 06, 2022
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాగుట్టును పోలీసులు రట్టుచేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 56లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. నిందితులు ఆన్ లైన్ లో బెట్టింగ్ లుకు పాల్పడుతున్నారని మహేష్ భగవత్ చెప్పారు.నిందితుల వద్దనుంచి ఒక ల్యాప్ టాప్, ఒక కారు, రెండు టూ వీలర్లు, 45 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా అని…ఐపీఎల్ సీజన్ రాగానే బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారని పోలీసుకమీషనర్ చెప్పారు. రాజస్థాన్ రాయల్, బెంగుళూరు మధ్య జరిగే మ్యాచ్ కు బెట్టింగ్ కు పాల్పడుతున్నారని…. పాండిచేరి లోని యానాం నుండి బెట్టింగ్ నడిపిస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ కేసులో సబ్ బుకిస్, బుకిస్, ఫంటర్లను అరెస్ట్ చేసాం, ప్రధాన నిందితుడు సాయి రామ్ ప్రస్తుతం పరారీ లో ఉన్నాడని ఆయన వివరించారు. అరెస్టైన ఏడుగురిలో నాగరాజు అనే నిందితుడు 2016 లో ఒకసారి క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ నిషేధం.. సెక్షన్ 3, సెక్షన్ 4 కింద తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమీషనర్ తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లల మీద నిఘాఉంచాలి.. ఆన్‌లైన్‌లో గేమ్స్, బెట్టింగ్‌లకు పాల్పడకుండా చూడాలి. ఎవ్వరు కూడా బెట్టింగ్ లకు పాల్పడకుండా ఉండాలని కోరుతూ…బెట్టింగ్ లకు పాల్పడుతున్న వారి వివరాలు కోసం 9490617111 కాల్ చేసి చెప్పాలని మహేష్ భగవత్ కోరారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







