రియాద్ రోడ్డుపై సౌదీ డ్రైవర్ వీరంగం
- April 07, 2022
సౌదీ: రియాద్‌లోని పబ్లిక్ రోడ్డుపై తప్పుడు దిశలో డ్రైవింగ్ చేస్తూ కనీసం 11 వాహనాలను ఢీకొట్టిన సౌదీ వ్యక్తిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనా స్థలంలో ఉన్న భద్రతా సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు డ్రైవర్‌ను బలవంతంగా ఆపడానికి కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. అయినా అతను డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఉద్దేశపూర్వకంగా దారిలో ఉన్న కార్లను ఢీకొన్నాడు. ఈ ఘటనలో కనీసం 11 పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలంలో ఉన్న ఇద్దరు భద్రతా సిబ్బంది పాత్రపైనా విచారణ చేస్తున్నట్లు రియాద్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







