‘దేవా’ IPOకు Dh22.3 బిలియన్ల విలువైన ఆఫర్లు

- April 07, 2022 , by Maagulf
‘దేవా’ IPOకు Dh22.3 బిలియన్ల విలువైన ఆఫర్లు

దుబాయ్: దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) అధిక సంఖ్యలో సబ్‌స్క్రయిబ్ చేయబడింది. Dh315 బిలియన్ల విలువైన ఆఫర్‌లు వచ్చాయి. Dh22.3 బిలియన్ల విలువైన ఈ IPO 2022లో ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్, ఐరోపాలో అతిపెద్దదిగా నిలిచింది. అంతర్జాతీయ సావరిన్, ప్రైవేట్ ఫండ్స్ తో పాటు 65,000 మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేశారని దుబాయ్ డిప్యూటీ రూలర్, డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. దేవా IPO ఈ ప్రాంతంలో రెండవ అతిపెద్దదని, ఈ విజయం దుబాయ్ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచానికి ఉన్న విశ్వాసం, స్థానిక ఆర్థిక మార్కెట్లపై నమ్మకాన్నితెలుపుతుందని షేక్ మక్తూమ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com