'తానా-తెలుగు పరివ్యాప్తి కమిటీ' ఆధ్వర్యంలో 'తెలుగు తేజం పోటీలు'
- April 07, 2022
అమెరికా: తెలుగు భాషా సాహిత్యం, పరివ్యాప్తి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస పిల్లలు, యువకులకు తెలుగు భాషపై మక్కువ, పటిష్ఠత, అభిరుచి పెంచడం కోసం తాజాగా ‘తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ’ ఆధ్వర్యంలో ‘తెలుగు తేజం పోటీలు’ నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తున్న పిల్లలు మినహా ప్రవాస దేశాలలో నివసిస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా నిర్వాహకులు తల్లితండ్రులకు వారి పిల్లలను ప్రోత్సహించి ఈ పోటీలలో భాగస్వాములు చేయవలసిందిగా కోరారు. దరఖాస్తు, ప్రవేశ రుసుము, నియమ నిబంధనలు కోసం https://forms.gle/ u1gqzHFhTT3a6yYg9 లింక్ ద్వారా చూడవచ్చు. దరఖాస్తు, ప్రవేశ రుసుము చెల్లించడానికి ఆఖరు తేది: ఏప్రిల్ 25, 2022. జూన్ 4,5 తేదీలలో జూమ్ ద్వారా పోటీల నిర్వహణ ఉంటుంది.

_1649310421.jpg)
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







