ఏపీ కేబినెట్..36 అంశాలపై కేబినెట్ లో చర్చ
- April 07, 2022
అమరావతి: సీఎం జగన్ నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశమే కేబినెట్‌లోని 24 మంది మంత్రులకు చివరి కేబినెట్ సమావేశంగా పరిగణిస్తున్న నేపథ్యంలో భేటీకి హాజరైన మొత్తం 24 మంది మంత్రులు తమ వెంట ఖాళీ లెటర్ హెడ్‌లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో నిర్దేశిత అజెండాపై చర్చ ముగియగానే… మంత్రులంతా తమ పదవులకు రాజీనామాలు చేయనున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే…ఈ భేటీలో మొత్తం 36 అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు కొత్తపేట కేంద్రంగా మరో కొత్త రెవెన్యూ డివిజన్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







