సుప్రీం చేతిలో ఓడిపోయిన ఇమ్రాన్ ప్రభుత్వం
- April 07, 2022
ఇస్లామాబాద్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గురువారం గట్టి షాకిచ్చింది సుప్రీం కోర్టు. ఇమ్రాన్ సర్కారుపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సిందేనంటూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఓటింగ్‌ను నిర్వహించమని ఆదేశించింది. గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి.
కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఇప్పటికే ఇమ్రాన్ పార్టీలోని కొందరితో పాటు మద్దతిస్తున్న మిత్రపక్షాల‌్లోని మరికొందరు నేతలు విపక్షంతో చేరిపోయారు.
ఇటువంటి కీలక సమయంలో తమ ప్రభుత్వ మనుగడ కోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేసిన ఇమ్రాన్… పాక్ జాతీయ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌తో ప్రకటన చేయించారు. ఇమ్రాన్ వ్యూహం మేరకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను రద్దు చేసిన డిప్యూటీ స్పీకర్.. ఏకంగా జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విపక్షాలకు అనుకూలమైన తీర్పు వచ్చింది.
జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదంటూ వెల్లడించింది కోర్టు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







