Etisalat నెట్వర్క్ లో తలెత్తిన సమస్యలు.. ఫిర్యాదుల వెల్లువ
- April 08, 2022
యూఏఈ: గురువారం సాయంత్రం Etisalat నెట్వర్క్ లో సమస్యలు తలెత్తినట్లు ఎమిరేట్ లోని అనేక వందల మంది యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. Etisalat అధికారిక అకౌంట్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లతో హోరేత్తించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వందలాది మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. Downdetector.ae ప్రకారం.. సుమారు రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటర్నెట్ సేవల ఆగిపోయాయని, అర్ధరాత్రి వరకు ఇదే విధంగా నెట్ వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చాయని 1,978 ఫిర్యాదులను వినియోగదారులు నమోదు చేశారు. అత్యధికంగా ల్యాండ్‌లైన్ ఇంటర్నెట్ కనెక్షన్ లో సమస్యలు వచ్చినట్లు 75 శాతం ఫిర్యాదులు రాగా.. మొబైల్ సేవల్లో సమస్యలు ఎదుర్కొనట్లు 17 శాతం మంది ఫిర్యాదు చేశారు. 8 శాతం మంది సిగ్నల్ అందలేని ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై Etisalat స్పందించింది. ప్రస్తుతం ఇంటర్నెట్ సర్వీసులో టెక్నికల్ ఇష్యూ తలెత్తిందని, సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పింది. అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







