క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టిన 33 శాతం రెసిడెంట్స్
- April 08, 2022
యూఏఈ: వర్చువల్ ఆస్తులను నియంత్రించే కొత్త చట్టాలను దుబాయ్ ఆమోదించిన ఒక నెల తర్వాత.. 33 శాతం యఏఈ రెసిడెంట్స్ క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పెట్టినట్లు ఒక సర్వేలో తేలింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారని సదరు సర్వే పేర్కొంది. UAEలోని రెసిడెంట్స్ తమ పెట్టుబడి పెట్టదగిన ఆస్తులలో 26 శాతం క్రిప్టోకరెన్సీకి కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఇది 20 శాతంగా ఉందని ఆన్‌లైన్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ టోలునా సర్వే పేర్కొంది. ఈ అధ్యయనం కోసం 18-64 సంవత్సరాల మధ్య ఉన్నవారిపై సర్వే నిర్వహించారు. ఎమిరేట్స్ లో 500 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 9,000 మందితో ఈ సర్వేను నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలను విశ్వసిస్తున్నట్లు 18 శాతం మంది UAE రెసిడెంట్స్ సర్వేలో చెప్పడం గమనార్హం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







