హ్యాండ్ బ్యాగేజీ రూల్స్ మార్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
- April 08, 2022
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, హ్యాండ్ బ్యాగేజీ నిబంధనల్ని మార్చడం జరిగింది. మారిన నిబంధనల ప్రకారం ప్రయాణీకులు ఒకటి కంటే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి వీల్లేదు. పొడవు, వెడల్పు, ఎత్తు విషయంలో 115 సెంటీమీటర్లకు మించి హ్యాండ్ బ్యాగ్ ఉండకూడదు. అయితే, లేడీస్ హ్యాండ్ బ్యాగ్, ఓవర్ కోట్ లేదా వ్రాప్, రగ్ లేదా బ్లాంకెట్, కెమెరా లేదా బైనాక్యులర్స్, విమానంలో చదువుకునేందుకు అవసరమైనవి, గొడుగు లేదా వాకింగ్ స్టిక్, చిన్న పిల్లల ఆహారం సంబంధితమైనవి, వీల్ ఛెయిర్ (మడతబెట్టడానికి వీలుగా వుండేది), ల్యాప్‌టాప్ బ్యాగ్ విత్ ల్యాప్‌టాప్ వంటి వాటికి మినహాయింపు వుంది. అయితే, సెక్యూరిటీ చెకింగ్ నిబంధనలకు అనుగుణంగా వీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







