పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
- April 08, 2022
న్యూ ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పడగ కొనసాగుతూనే ఉంది. కొత్త వేరియంట్ల రూపాంతరం చెందుతున్న మహమ్మారి మరోమారు తన ప్రతాపం చూపిస్తుంది. ఇప్పటికే చైనా, అమెరికా దేశాల్లో కరోనా నాలుగో దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా కొత్త వేరియంట్ “XE” వ్యాప్తి వేగంగా ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు..పలు దేశాలు కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. ఇక భారత్ లోనూ కరోనా XE వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్యశాఖ..ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా నాలుగో దశ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని అందుకు తగ్గట్టుగా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది.
ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర మరియు మిజోరం రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర వైద్యారోగ్యశాఖ..ఆయా ప్రభుత్వాలు గట్టి నిఘా ఉంచి, అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆమేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వైద్యారోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. కరోనా నాలుగో దశ వ్యాప్తి నివారణలో భాగంగా ముందస్తు డోస్ టీకాపై శుక్రవారం కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 10 నుండి ప్రైవేట్ టీకా కేంద్రాలలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రీకాషన్ డోస్ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
18 సంవత్సరాలు దాటిన వారు మరియు రెండవ డోస్ తీసుకుని తొమ్మిది నెలలు పూర్తైన వారందరూ ప్రీకాషన్ డోస్ కు అర్హులని ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతున్నట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటికే దేశంలో 15 ఏళ్లు ఆపై వయసున్న 96 శాతం మంది మొదటి డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని, రెండు డోసులు తీసుకున్న వారు 83 శాతం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







