షార్జాలో అధిక శబ్దంతో ప్రయాణిస్తున్న 510 కార్లు పట్టివేత
- April 10, 2022
షార్జా: 2021లో ఎమిరేట్‌లోని రోడ్లపై అధిక శబ్దంతో ప్రయాణిస్తున్న 510 కార్లను షార్జా పోలీసుల రాడార్ పరికరాల సాయంతో పట్టుకున్నాయి. ట్రాఫిక్, పెట్రోల్ డిపార్ట్మెంట్ ప్రతినిధి కెప్టెన్ సౌద్ అల్ షైబా మాట్లాడుతూ.. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే వాహనాలపై షార్జా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. ఫెడరల్ ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 20 ప్రకారం.. 95 డెసిబుల్స్ దాటిన వారికి 2,000 దిర్హామ్‌లు జరిమానా విధించవచ్చు. ఆరు నెలల వరకు వాహనాన్ని జప్తు చేయడంతోపాటు 12 బ్లాక్ పాయింట్లను జారీ చేయవచ్చు. నాయిస్ రాడార్ సిస్టమ్ 2019 నుండి ఎమిరేట్‌లోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. సిస్టమ్ అధునాతన కెమెరాతో అనుసంధానించబడిన సౌండ్ మీటర్‌ను కలిగి ఉంటుంది. వాహనం నుండి శబ్దం స్థాయి ఎక్కువగా ఉంటే, కెమెరా లైసెన్స్ ప్లేట్‌ను క్యాప్చర్ చేస్తుంది. దీంతో వాహన డ్రైవర్‌కు జరిమానా విధించవచ్చు. పెద్ద శబ్దంతో వాహనాలు వెళ్లేటప్పుడు వాహనదారులు, పరిసరాల నివాసితులు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ఇబ్బంది కలుగుతుందని కెప్టెన్ అల్ షైబా చెప్పారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఎమర్జెన్సీ కోసం 999, నాన్ ఎమర్జెన్సీ కోసం 901 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా నివాస పరిసరాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే వాహనాలపై ఫిర్యాదు చేయాలని కెప్టెన్ అల్ షైబా ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







