పాస్‌పోర్ట్ లపై వీసా స్టాంపింగ్ లేదు: యూఏఈ

- April 11, 2022 , by Maagulf
పాస్‌పోర్ట్ లపై వీసా స్టాంపింగ్ లేదు: యూఏఈ

యూఏఈ: నేటి నుండి యూఏఈ నివాసితుల ఎమిరేట్స్ ID వారి నివాస పత్రంగా పనిచేయనుంది. ఇది పాస్‌పోర్ట్‌లపై స్టాంప్ చేసే రెసిడెన్సీ వీసా స్టిక్కర్‌ల స్థానాన్ని భర్తీ చేయనుంది. ఇకపై నివాసితులు రెండు వేర్వేరు వీసా, ఎమిరేట్స్ ID ప్రక్రియల ద్వారా వెళ్లవలసిన అవసరం లేదు. ఒకే అప్లికేషన్‌ ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా వీసా స్టాంపింగ్ కోసం దరఖాస్తుదారులు తమ పాస్‌పోర్ట్‌లను ఇమ్మిగ్రేషన్ కార్యాలయాల వద్ద వదిలివేయాల్సిన అవసరం కూడా లేదని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP)లోని ఒక ఉన్నత అధికారి తెలిపారు. ఈ కొత్త ప్రక్రియ 30 నుండి 40 శాతం రెసిడెన్సీ పత్రాలను పొందే సమయాన్ని తగ్గిస్తుంది. అప్డేట్ చేయబడిన ఎమిరేట్స్ ఐడీలో వీసా స్టిక్కర్‌లో అందుబాటులో ఉన్న అన్ని సంబంధిత రెసిడెన్సీ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంటుంది. కొత్త తరం ఎమిరేట్స్ ID వ్యక్తిగత, వృత్తిపరమైన డేటా, జారీ చేసే సంస్థ మరియు ఇ-లింక్ సిస్టమ్ ద్వారా చదవగలిగే ఇతర డేటాను కలిగి ఉంటుంది. రెసిడెన్సీ స్టిక్కర్ అధికార యాప్ ద్వారా మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. అదనంగా, ప్రజలు తమ నివాస వివరాలను ప్రింటెడ్ ఫార్మాట్‌లో అథారిటీ స్టాంపుతో మూడు దశల్లో పొందవచ్చు. ఇది యాప్ లేదా వెబ్‌సైట్ (http://www.icp.gov.ae) ద్వారా చేయవచ్చు. యూఏఈ వెలుపల ఉన్న నివాసితుల కోసం, అధికారులు పాస్‌పోర్ట్ రీడర్ ద్వారా వారి ప్రవేశ స్థితిని ధృవీకరించుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com