ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్లను ప్రారంభించిన దుబాయ్

- April 11, 2022 , by Maagulf
ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్లను ప్రారంభించిన దుబాయ్

దుబాయ్ : ఈ నెలాఖరు నాటికి దుబాయ్ ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్‌ల జారీని ప్రారంభించనున్నట్లు వినియోగదారులు రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA)  ప్రకటించింది. ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్‌ల ఉచిత అనుమతి కోసం ఆర్టీఏ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పర్మిట్ల జారీ ప్రక్రియలో శిక్షణా కోర్సులకు హాజరు కావడం, ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం వంటివి ఉంటాయని పేర్కొంది. ప్రకటించిన ప్రాంతాలలో సురక్షితమైన రోడ్లపై ఈ-స్కూటర్లను నడపడానికి ఈ అనుమతిని పొందడం తప్పనిసరి అని అథారిటీ తెలిపింది. అయితే స్థానిక, అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ లను కలిగి ఉన్నవారికి లైసెన్స్ పొందడం నుండి మినహాయింపు ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com