మానసిక రోగులకు డ్రైవింగ్/ఆయుధ లైసెన్సులను ఆపేందుకు అధ్యయనం
- April 11, 2022
కువైట్: డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆయుధ లైసెన్సులు పొందేందుకు అర్హత లేని వ్యక్తుల డేటా(మానసిక సమస్యలతో బాధపడే రోగులు)ను ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సమన్వయంతో అంతర్గత మంత్రిత్వ శాఖ తనిఖీ చేస్తోంది. కువైట్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ అడిక్షన్ సెంటర్ డేటాను కనెక్ట్ చేయడానికి అధికారులు అంతర్గత మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య ఆటోమేటిక్ లింక్‌ను ఏర్పాటు చేశారు. మానసిక ఆరోగ్యం లేదా వ్యసనానికి సంబంధించిన రికార్డు ఉన్న ఏ వ్యక్తి అయినా డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆయుధాల లైసెన్స్ లను పొందేందుకు అర్హత లేని వ్యక్తిగా గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకుంటారు. అలాగే తీవ్రమైన మానసిక వ్యాధులు, వ్యసనపరులకు ఆయుధాల లైసెన్సులను మంజూరు చేయకుండా చూస్తారు. ప్రజల భద్రత, రోడ్లపై ప్రమాదాల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ఈ చర్యను చేపట్టారు. అధ్యయనంలో భాగంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రభుత్వ ఆమోదం తర్వాత అమలు చేయబడుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







