గుజరాత్: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు…ఆరుగురి మృతి
- April 11, 2022
గుజరాత్: గుజరాత్ భారుచ్ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈరోజు భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు.అహ్మదాబాద్ నగరానికి 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ పారిశ్రామికవాడలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది.పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో అక్కడ సమీపంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మరణించారు.
కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపు చేశామని భారుచ్ జిల్లా ఎస్పీ లీనా పాటిల్ చెప్పారు. రియాక్టర్ పేలుడులో అక్కడే పనిచేస్తున్న కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







