పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలను ముంచెత్తిన వరదలు ..

- April 04, 2016 , by Maagulf
పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలను ముంచెత్తిన వరదలు ..

పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 57 మంది మృతిచెందగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పాక్‌లోని ఖైబర్‌ పక్తుంక్వా ప్రావిన్స్‌, షాంగ్లా జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వరదల కారణంగా షాంగ్లా జిల్లాలో 14 మంది, కోహిస్థాన్‌లో 12 మంది, స్వాత్‌లో 8 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పాక్‌ ఆక్రమిక కశ్మీర్‌, గిల్గిత్‌ బల్తిస్థాన్‌ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి చిన్నారులతో సహా ఎనిమిదిమంది మృతిచెందారు. భారీ వరదలకు పలు ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వరదలు తగ్గుముఖం పట్టేవరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com