పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలను ముంచెత్తిన వరదలు ..
- April 04, 2016
పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 57 మంది మృతిచెందగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పాక్‌లోని ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్, షాంగ్లా జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వరదల కారణంగా షాంగ్లా జిల్లాలో 14 మంది, కోహిస్థాన్‌లో 12 మంది, స్వాత్‌లో 8 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పాక్ ఆక్రమిక కశ్మీర్, గిల్గిత్ బల్తిస్థాన్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి చిన్నారులతో సహా ఎనిమిదిమంది మృతిచెందారు. భారీ వరదలకు పలు ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వరదలు తగ్గుముఖం పట్టేవరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







