ఒమన్ లో 2025 నాటికి 30 కంపెనీల ప్రైవేటీకరణ
- April 12, 2022
మస్కట్: 2025 నాటికి 30కి పైగా పబ్లిక్ కంపెనీలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (OIA) చైర్మన్ హెచ్ ఈ అబ్దుల్ సలామ్ బిన్ ముహమ్మద్ అల్ ముర్షిది తెలిపారు. అథారిటీకి దాదాపు 160 ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయన్నారు. ప్రైవేటీకరణ ఒక విజయవంతమైన ప్రక్రియ అని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన ఒక రేడియో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఐదేళ్లలో 30కి పైగా ప్రభుత్వ అనుబంధ కంపెనీలను ప్రైవేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కంపెనీలను మస్కట్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ప్రైవేట్ కంపెనీలుగా మార్చితే.. ఒమానీ పౌరులు పెట్టుబడిదారులు పెట్టవచ్చన్నారు. ఎంపిక చేసిన రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ దృష్టి సారిస్తోందన్నారు. మహమ్మారి కాలంలో ఆర్థికంగా చితికిపోయిన కంపెనీలకు సహాయం చేసేందుకు అధికార యంత్రాంగం ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని అల్ ముర్షిది తెలిపారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!