యూఏఈ లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
- April 12, 2022
రస్ అల్ ఖైమా: శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తెలుగు తరంగిణి, సంప్రదాయం మరియు ఇస్కాన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో యూఏఈ లోని రస్ అల్ ఖైమా నగరంలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన కూచిపూడి నృత్యాలు, ఇస్కాన్ బృంద చిన్నారుల రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత పారాయణాల నడుమ శ్రీరామ జన్మదిన వేడుకలు ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండువగా కొనసాగాయి. శ్రీ సీతారాముల పల్లకి సేవలో భక్తులందరూ పాల్గొని భక్తి పారవశ్యంతో పులకరించారు.
పానకం, వడపప్పు, కమ్మని విందు భోజనాలతో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకున్న ఈ కార్యక్రమానికి యూఏఈ లోని వివిధ ఏమిరేట్స్ నుండి ఇస్కాన్ భక్త బృందాలు, భక్తులు సుమారు 3,000 వేలకు మందికి పైగా హాజరు అయ్యారు.
తెలుగు తరంగిణి అద్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్, సంప్రదాయం ధర్మరాజ మురారిదాస్ ప్రభు ల ఆధ్వర్యంలో సభ్యులు అందరు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా సహకారాన్ని అందించింది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!