ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష విజయవంతం: ఎమ్మెల్సీ కవిత
- April 12, 2022
న్యూ ఢిల్లీ: 24 గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్ళు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో తెలంగాణ రైతులతో కలిసి కొట్లాడుతామని కవిత తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. అంతేకాదు, మోదీ ప్రభుత్వం రైతుల శక్తిని తక్కువగా అంచనా వేస్తోందన్న కవిత, ఢిల్లీలో తాము ధర్నా చేస్తుంటే, హైదరాబాద్ లో బీజేపీ దొంగ దీక్ష చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులకు పంటకు పెట్టిన కనీస ఖర్చు కూడా రావడం లేదని, అయినా క్రూరమైన బీజేపీ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస సానుభూతి కూడా లేదని కవిత మండిపడ్డారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వాలు నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు కవిత. రైతులందరికీ ఒకే దేశం- ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని కవిత పేర్కొన్నారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







