తెలంగాణలో మరో రూ. 200 కోట్ల పెట్టుబడులు..
- April 12, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. బీఎస్ వీ గ్లోబల్ అనే సంస్థ హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లను తయారు చేసే యూనిట్ ను నెలకొల్పనుంది. నేడు ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ.200 కోట్లతో సంస్థ ఆ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. సంస్థ పెట్టుబడులతో హైదరాబాద్ కు వ్యాక్సిన్ హబ్ అనే పేరు సార్థకం అవుతుందని చెప్పారు. సంస్థ ఎండీ సంజీవ్ స్నావన్ గుల్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఇటీవల కేటీఆర్ అమెరికాలో పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. క్వాల్కమ్, క్యాలవే, ఫిస్కర్ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిన సంగతి విదితమే. ఫిష్ఇన్ అనే సంస్థ మిడ్ మానేరులో చేపల ప్రాసెసింగ్ యూనిట్ ను పెడతామని హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







