రష్యా లోఅగ్నిప్రమాదం..
- April 04, 2016
రష్యాలోని టామ్స్క్ ప్రాంతంలో నివాసగృహంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 8 మంది సజీవదహనం అయ్యారు. ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా మంటలు వేగంగా వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో లోపల ఉన్నవారంగా బయటకు వచ్చే మార్గం లేక మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలంలో ఏడుగురు చనిపోగా... ఓ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతుల్లో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా... మరొకరు అతిథి అని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







