మే 4, 5న తెలంగాణ‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ..పీసీసీ నేత‌ల‌తో భేటీ

- April 14, 2022 , by Maagulf
మే 4, 5న తెలంగాణ‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ..పీసీసీ నేత‌ల‌తో భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. మే నెల 4న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్న రాహుల్ గాంధీ..రెండు రోజుల పాటు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తారు. మే 4న వ‌రంగ‌ల్‌లో టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ పాల్గొంటారు. ఆ త‌ర్వాతి రోజున…మే 5న బోయిన్‌ప‌ల్లిలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న ఖ‌రారైన‌ట్లుగా టీపీసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.
 
తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ శుక్ర‌వారం నాడు హైద‌రాబాద్ రానున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పీసీసీ కార్య‌వ‌ర్గంతో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌, వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌పై ఆయ‌న స‌మీక్షించ‌నున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com