అభ్యంతరకర ప్రవర్తన: మహిళ అరెస్టుకి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశం
- April 14, 2022
అబుదాబీ: ఓ మహిళ సంయమనం కోల్పోయి అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో ఆమెను అరెస్టు చేయాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించడం జరిగింది. హోటల్ లాబీల్లో సదరు మహిళ బిగ్గరగా అరవడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, మహిళా అధికారులపై దాడి చేసేందుకు యత్నించడం అలాగే దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వంటివి చేసిందని విచారణలో తేలింది. హోటల్‌కి వచ్చీ రావడంతోనే ఆ మహిళ వింతగా ప్రవర్తించిందని హోటల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆమె ప్రవర్తన పట్ల విసుగు చెంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిపైనా దాడికి ఆమె యత్నించింది. ఓ కోల్డ్ వెపన్ అలాగే 15 మొబైల్ ఫోన్లు, సర్వైలెన్స్ కెమెరాలు, ల్యాప్‌టాప్‌లో ఆమె వద్ద స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!