ఫేక్ బ్యాంక్ కార్డు కుంభకోణం: ఒకరి అరెస్ట్
- April 14, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఒమనీ బ్యాంకింగ్ చట్టాన్ని ఉల్లంఘించడంతో ఒకర్ని అరెస్టు చేయడం జరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు అనుమానిత మెటల్ బ్యాంక్ కార్డుల్ని నిందితుడు వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు డిపార్టుమెంట్ ఫర్ కంబాటింగ్ ఎకనమిక్ క్రైమ్స్ తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. నిందితుడ్ని గుర్తించి, పట్టుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రకటన ఇచ్చి నిందితుడు సాధారణ కార్డుల్ని ప్రత్యేకమైన సాంకేతిక వున్న కార్డులతో మార్చుతున్నట్లు పేర్కొన్నాడనీ, పలువుర్ని మోసం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ తరహా మోసాలకు పాల్పడేవారు, ఒరిజినల్ కార్డుల్లోని డేటాని, డూప్లికేట్ కార్డుల్లోకి మార్చి దోచుకుంటుంటారని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు