బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై నిషేధం: రష్యా
- April 16, 2022
మాస్కో: ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో తనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆంక్షలు విధించిన నేపథ్యంలో, రష్యా కూడా ప్రతిచర్యకు దిగింది. అప్పటికే పలువురు అంతర్జాతీయ నేతలు రష్యాలో ప్రవేశించకుండా నిషేధించిన పుతిన్ ప్రభుత్వం… తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పైనా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.
అంతేకాదు, రష్యాలో ప్రవేశించకుండా బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ +ట్రస్, అనేకమంది క్యాబినెట్ మంత్రులపైనా నిషేధాజ్ఞలు విధించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. మొత్తమ్మీద ప్రధాని బోరిస్ జాన్సన్ సహా 13 మంది బ్రిటన్ ప్రముఖులను నిషేధిత నేతల జాబితాలో చేర్చింది. వారిలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరిస్సా మే కూడా ఉన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ జాబితాను మరింత విస్తరిస్తామని కూడా రష్యా హెచ్చరించింది.
ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు దిగిన నేపథ్యంలో, రష్యాను ఏకాకిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలకు తెరలేపాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన కుటుంబ సభ్యులపై అనేక దేశాలు నిషేధం విధించాయి. పుతిన్ కుటుంబ ఆస్తులతో పాటు, విదేశాల్లోని రష్యన్ కుబేరుల ఆస్తులపైనా, రష్యా కంపెనీలపైనా కఠిన ఆంక్షలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, రష్యా కూడా పలు దేశాల ప్రముఖులను నిషేధిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







