రామోజీ ఇంట కల్యాణం.. ఘనంగా బృహతి- అక్షయ్ పరియణ వేడుక..
- April 16, 2022
హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మనవరాలు బృహతి పరిణయ వేడుక రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఘనంగా జరుగుతోంది.దండమూడి అమర్ మోహన్‌దాస్, అనితల కుమారుడు వెంకట్ అక్షయ్.. ఈనాడు ఎండీ సీహెచ్. కిరణ్, శైలజ దంపతుల ద్వితీయ కుమార్తె బృహతి శనివారం రాత్రి 12 గంటల 18 నిమిషాల శుభముహూర్తాన వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రామోజీ ఫిల్మ్‌సిటీకి విచ్చేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, అగ్ర కథానాయకులు రజనీకాంత్, చిరంజీవి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.వీరితో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్‌రావు, తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్‌కుమార్, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, సినీ ప్రముఖులు మోహన్‌బాబు, మురళీమోహన్, దర్శకుడు రాజమౌళి, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, అశ్వనీదత్, సాయికుమార్, రాజేంద్రప్రసాద్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









