మే 3-5 నుంచి దోహా కార్నిచ్‌లో ఈద్ ఫెస్టివల్‌

- April 18, 2022 , by Maagulf
మే 3-5 నుంచి దోహా కార్నిచ్‌లో ఈద్ ఫెస్టివల్‌

దోహా: మే 3-5 నుండి దోహా కార్నిచ్‌లో మొట్టమొదటి ఈద్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు ఖతార్ టూరిజం ప్రకటించింది. కరోనా పరిమితులు ఎత్తివేసిన తర్వాత వస్తున్న ఈద్‌ను ఘనంగా జరుపేందుకు టూరిజం శాఖ ప్రణాళికతలు రూపొందించింది. వ్యక్తిగత ఈవెంట్‌లను అనుమతించడంతోపాటు, ఈద్ ఫెస్టివల్‌లో దేశంలోని మొట్టమొదటిసారిగా భారీ బెలూన్ పరేడ్, మార్చింగ్ బ్యాండ్‌లు, కార్నివాల్ గేమ్‌లు, బాణసంచా, ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఖతార్ టూరిజం చైర్మన్, ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, హెచ్‌ఇ అక్బర్ అల్ బేకర్ తెలిపారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని టూరిజం శాఖ అద్భుత ఏర్పాట్లు చేస్తుందన్నారు. అలాగే ఖతార్ టూరిజం ఏడాది పొడవునా దేశీయ, ప్రాంతీయ,  అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించే ఉత్పత్తులు, సేవలు, ఈవెంట్‌లను ప్రైవేట్ రంగాల భాగస్వాములతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com