ఏసియన్ థియేటర్స్ అధినేత..నిర్మాత నారంగ్ మృతి
- April 19, 2022
హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్‌కు అధినేత,తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు నారంగ్(78) కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్‌కు అధినేత నారంగ్. శ్రీ వేంకటేశ్వర బ్యానర్లో ‘లవ్ స్టోరీ’, ‘లక్ష్య’ సినిమాలు నిర్మించిన ఆయన ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’, ధనుష్‌తో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గా సినీపరిశ్రమకు సేవలందించారు నారంగ్. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. నారాయణ దాస్ మరణంపై ఎంటైర్ టాలీవుడ్ విచారాన్ని వ్యక్తం చేసింది. మధ్యాహ్నాం 12 గంటలకు హాస్పిటల్ నుంచి నారాయణ్ దాస్ నారంగ్ భౌతికకాయం ఫిల్మ్ నగర్ లోని నివాసానికి తరలిస్తారు. అక్కడకు సినీ ప్రముఖులు చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, మూవీ ఫైనాన్సియర్‌గా సినీ రంగానికి సేవలు అందిస్తోన్న ఆయన ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌గానూ కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







