పోస్ట్ కోవిడ్ లివర్ క్లినిక్ ను ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్

- April 19, 2022 , by Maagulf
పోస్ట్ కోవిడ్ లివర్ క్లినిక్ ను ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్

హైదరాబాద్: ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమాన్ని మరియు పోస్ట్ కోవిడ్ లివర్ క్లినిక్ ను ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ పాల్గొని ఈ క్లినిక్ ని రిబ్బన్ కట్ చేసి ప్రాంభించడం జరిగింది.

డాక్టర్ అనిల్ కృష్ణ-చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ మాట్లాడుతూ  కోవిడ్ మహమ్మారి చేసిన విలయతాండవం ఎన్నో జీవితాలను చిదిమేసింది.మన జీవనాని తారుమారు చేసింది. కరోనా వల్ల మన జీవనవిధానం పూర్తిగా మారిపోయింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కరోనా బారిన పడ్డవాళ్ళు చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు.అందులో ఫ్యాటీ లివర్ సమస్యలు అధికం.

ఈ సందర్భంగా డాక్టర్ సచిన్ దాగా-HOD–హెచ్ పి బి & కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు మాట్లాడుతూ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. గత కొన్నాళ్లుగా కాలేయ వ్యాధిగ్రస్తులు సంఖ్య క్రమేనా పెరుగుతున్నది.
శరీరంలో ఉన్న రెండో అతి పెద్ద అవయవం కాలేయం.ఇది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ఈ అవయవమే కీలకం.కాలేయం జబ్బు పడిన కూడా తనను తాను బాగుచేసుకోగలదు, శరీరానికి కావాల్సిన శక్తిని తయారు చేయగలదు.పావువంతు అవయవం బాగున్నా తనను తాను నిర్మించుకోగలదు. అటువంటి అద్భుతమైన అవయవం కాలేయం. అయితే, ఇండియాలో అత్యధిక ప్రజలు కాలేయ వ్యాధి బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవ్వుతున్నట్లు గణంకాలు తెలుపుతున్నాయి.ఒకప్పుడు హెపటైటీస్ బీ, సీ వల్ల మాత్రమే కాలేయ సమస్యలు వచ్చేవి. అయితే, ఇప్పుడు మారుతున్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకుపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ప్రజలు కాలేయ సమస్య కొనితెచ్చుకుంటున్నారు.ఇది ఏ మాత్రం దెబ్బతిన్నా శరీరం అదుపు తప్పుతుంది.క్రానిక్ లివర్ డిసీజ్, అక్యూట్ లివర్ డిసీజ్ (క్రిటికల్ కేసులు) మరియు లివర్ క్యాన్సర్ కేసులు రోజురోజుకు 30-50 కొత్త కేసులు నమోదవుతున్నాయి.


డాక్టర్ మోకా ప్రణీత్ మాట్లాడుతూ ఫ్యాటీ లివర్  అనేది కాలేయం చుట్టూ కొవ్వు చేరడం వల్ల వస్తుంది. ఇది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఆల్కహాల్ రెండు నాన్ ఆల్కహాల్.అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీస్ వస్తుంది.ఒక వేళ మద్యం తాగకపోయిన ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తుంటే దాన్ని నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీస్ అంటారు.ఈ సాధారణ కాలేయ వ్యాధి 5-20 శాతం భారతీయులని ప్రభావితం చేస్తుంది అని అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ సుబ్రమణ్య శ్రీనివాస్-గాస్ట్రోఎంటరోలాజిస్ట్,కాలేయం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

కాలేయం ఎలా పనిచేస్తుంది? 
ఇది మన శరీరంలో ప్రవేశించే హానికర పదార్దాలను తొలగించడం. జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్ ను ఉత్పత్తి చేయడం.విటమిన్-ఐరన్ వంటి పోషకాలను నిల్వచేయడం, ఆహారాన్ని శక్తి రూపంలో మార్చడం.శరీరంలో వివిధ హార్మోన్స్ విడుదల నియంత్రించడం.రక్తం గడ్డకట్టటానికి మరియు గాయాలు తొందరగా మనటానికి కావాల్సిన ఎంజైమ్స్ ను విడుదల చేయడం మరియు జీర్ణకోశ నాళము నుంచి వచ్చే రక్తాన్ని కాలేయం వడపోస్తుంది. ఆ తర్వాతే రక్తం శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది.అలాగే, ఆహారం ద్వారా వచ్చే రసాయనాలు, వాటిలోని విషతుల్య పదార్థాలను తొలగిస్తుంది.ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, బ్లడ్ షుగర్లు కాలేయం నియంత్రించడం వంటి కీలకమైన బాధ్యతలను కాలేయం నిర్వహిస్తుంది.

చేయకూడనివి:
1. మద్యానికి దూరంగా ఉండండి. అతిగా తాగడం వల్ల లివర్ దెబ్బతింటుంది.
2. కొవ్వు పదార్థాలు, వేపుళ్లు అతిగా తినొద్దు.
3. ఉప్పు, చక్కెరలు ఎక్కువ మొతాదులో తీసుకోవడం ప్రమాదకరం.
4. ప్రాసెస్ చేసిన పిండి, ధాన్యాలను తినవద్దు.
5. బీఫ్, పంది, మేక (రెడ్ మీట్) మాంసాలను అతిగా తినొద్దు.

ఇలా చేయండి:
1. పచ్చని ఆకుకూరలు తినండి. ఇవి లివర్‌ను శుభ్రంగా ఉంచుతాయి.
2. సల్ఫర్ ఎక్కువగా ఉండే వెల్లులి పాయలు లివర్‌ను కాపాడతాయి.
3. పసుపు కాలేయానికి మేలు చేస్తుంది. గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు సైతం కాలేయానికి మంచివే.
4. మంచి కొవ్వులను తీసుకోండి. ఆలీవ్ ఆయిల్, వాల్ నట్స్, అవకడోస్‌లు కాలేయాన్ని శుభ్రం చేస్తాయి.
5. విటమిన్-సి ఎక్కువగా తీసుకోండి. ఇది కాలేయం వద్ద కొవ్వులను నియంత్రిస్తాయి.
6. రోజు నీటిని ఎక్కువ తాగడం. దీనివల్ల కాలేయాన్ని ఆరోగ్యం ఉంచుతుంది.

ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ డాక్టర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com