సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టం: గవర్నర్ తమిళిసై
- April 19, 2022
చెన్నై: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టమన్నారు.
చెన్నైలో తన కాఫీ టేబుల్ పుస్తకావిష్కరణ సందర్భంగా తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం, గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా ఉంటుందో తెలంగాణను చూస్తే అర్థమవుతుందన్నారు.
తాను ఇద్దరు వేర్వేరు సీఎంలతో పని చేస్తున్నానని.. ఇద్దరూ చాలా భిన్నమైనవారని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు ముఖ్యమంత్రులు నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు.
తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ను కానని తేల్చి చెప్పారు. సీఎం చెప్పారని ప్రతి ఫైల్ పై సంతకం చేయనని స్పష్టం చేశారు. తనను వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తారనేది అవాస్తం అన్నారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే తనపై అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







