స్వీడన్, ఫిన్లాండ్ దేశాలను హెచ్చరించిన రష్యా
- April 20, 2022
కీవ్: పుతిన్ ప్రభుత్వం స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. నాటోలో చేరాలన్న ఉద్దేశం సరికాదని, కాదని ప్రయత్నాలు చేస్తే, రాబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వుంటుందని తీవ్రంగా హెచ్చరించింది.ఈ విషయాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా, బహిరంగంగా కూడా ఇప్పటికే చెప్పామని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా పేర్కొన్నారు.ఈ ప్రకటనను చూసి ఏమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదని, ద్వై పాక్షిక చర్చల సమయంలోనూ, బహిరంగంగాను ఇప్పటికే ఆ దేశాలకు హెచ్చరికలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.
ఇక ఇదే విషయాన్ని రష్యా మాజీ ప్రెసిడెంట్ దిమిత్రీ మొద్వేదేవ్ కూడా పేర్కొన్నారు. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలను నాటోలో చేర్చాలని ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని అమెరికా, యూరోపియన్ యూనియన్లను ఆయన హెచ్చరించారు.బాల్టిక్ దేశాలు, స్కాండినోవియా ప్రాంతాల్లో అణ్వాయుధాలను కూడా మోహరిస్తామని దిమిత్రీ సూటిగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







