త్వరలో ‘ఆయుష్ వీసా’: ప్రధాని మోదీ

- April 20, 2022 , by Maagulf
త్వరలో ‘ఆయుష్ వీసా’: ప్రధాని మోదీ

గాంధీనగర్‌: భారత దేశంలో చికిత్స తీసుకునేందుకు వచ్చే విదేశీయుల కోసం ‘ఆయుష్ వీసా’ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.గుజరాత్, గాంధీనగర్‌లో జరిగిన ‘గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సదస్సు-2022’లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేశంలో మెడిసిన్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా సంప్రదాయ దేశీ వైద్య విధానాన్ని (ఆయుష్ సెక్టార్) ప్రోత్సహిస్తామన్నారు. ‘‘త్వరలో రానున్న ‘ఆయుష్ వీసా’ ద్వారా దేశంలో ఆయుష్ థెరపీ తీసుకునేందుకు వచ్చే విదేశీయుల ప్రయాణం సులభతరమవుతుంది.

‘డిజిటల్ పోర్టల్’ ద్వారా దేశంలో వైద్య సంబంధమైన మొక్కలు పెంచే రైతులను, ఆయుష్ ఉత్పత్తుల తయారీదారులను ప్రోత్సహిస్తాం. కోవిడ్ సమయంలో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఎన్నో ఆయుష్ ఉత్పత్తులు ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఈ సమయంలో దేశం నుంచి పసుపు ఎగుమతులు పెరిగాయి. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు, అవకాశాల్ని పెంచుకోవాలి. సంప్రదాయ వైద్య రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం’’ అని వ్యాఖ్యానించారు మోదీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com